|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 12:52 PM
ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. జిల్లాలో రూ.3,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జిల్లా రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని అన్నారు.ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. జిల్లాలో రూ.3,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర బండి సంజయ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జిల్లా రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయని అన్నారు.రోడ్ల అభివృద్ధి పనుల కోసం తెలంగాణ నుంచి ఏ ఎంపీ అయినా.. పార్టీలతో సంబంధం లేకుండా మంత్రి నితిన్ గడ్కరీ దగ్గరికి వెళితే క్షణాల్లో పని అవుతుందని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓ మంచి మంత్రి అని.. ఆయన భోళా మనిషి అంటూ కామెంట్ చేశారు. తన మనసులో ఎలాంటి విద్వేషాలు ఉండవని.. ఏది ఉన్నా ఓపెన్‌గా చెప్పే మనస్తత్వమని అన్నారు.