|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 02:32 PM
పుష్ప-2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఇటీవల డిశ్చార్జి అయిన శ్రీతేజ్ హైదరాబాద్‌లోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. అతడిని ఇవాళ నిర్మాతలు అల్లు అర్జున్, బన్నీ వాసు పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పటి నుంచి అతని యోగ క్షేమాలను అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, రెస్ట్ తీసుకోవడం ముఖ్యమని, ఇంకొన్ని రోజుల్లో ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పినట్లు సమాచారం.కాగా, శ్రీతేజ్ హాస్పిటల్ ఖర్చులతో పాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు ఆర్థికంగా సహాయం చేసిన సంగతి తెలిసిందే.