|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:33 PM
ట్రైబల్ జర్నలిస్టుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లు అన్నారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి తో కలిసి 2025 ట్రైబల్ జర్నలిస్టుల డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రైబల్ జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు.