|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:36 PM
గాంధీ భవన్ లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించనున్న డా. మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ వారు బృహత్తర కార్యక్రమమైన ఫెలోషిప్ లాంచ్ చేయడం శుభపరిణామం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మంచి అవకాశంగా ఉండబోతుందని టీపీసీసీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.