|
|
by Suryaa Desk | Mon, May 05, 2025, 08:42 PM
డబ్బు సంపాదనే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు.తాజాగా హైదరాబాద్ లో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరిట కస్టమర్లకు వల వేస్తు వ్యభిచారానికి పాల్పడుతున్నారు.థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేయిస్తున్నారు. సర్వీస్ అపార్ట్ మెంట్ కేంద్రంగా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. థాయ్ లాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. నాయక్ అనే నిర్వాహకుడు ఈ దందాకు తెరలేపాడు.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్‌మెంట్ లో ఇద్దరు విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్ లో అక్రమంగా సరిహద్దు దాటి వచ్చిన బంగ్లా యువతి (23). డిసెంబర్ లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా థాయ్ లాండ్ యువతి(30) హైద్రాబాద్ వచ్చింది. బ్యాంకాక్ లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి నడిపించే బ్రోతల్ హౌస్ లో వ్యభిచారం చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి యువతిని తెచ్చిన ఏజెంట్.. థాయ్ లాండ్ మహిళ, బ్రోతల్ హౌస్ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.