|
|
by Suryaa Desk | Fri, May 30, 2025, 05:08 PM
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 2.10 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. వచ్చే నెల (జూన్) 10వ తేదీలోగా మిగతా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తామని తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, "పైలట్ ప్రాజెక్టు ద్వారా 42 వేల ఇళ్లను మంజూరు చేశాము. వీటిలో 24 వేల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. సుమారు 100 ఇళ్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పథకంలో పారదర్శకతను నిర్ధారించేందుకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు 40 శాతం లబ్ధిదారుల పేర్లు సిఫారసు చేసే అవకాశం కల్పిస్తున్నాం. మిగిలిన 60 శాతం లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేస్తాయి" అని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా పేదలకు పక్కా ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.