|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 11:59 AM
నల్గొండ మండలం అనంతారం నుంచి కొత్తపల్లి ముత్యాలమ్మ చెరువు కట్ట వరకు ఉన్న రహదారి వెంట కానుగ, కంప చెట్లు అధికంగా ఉన్నాయని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనంతారం మాజీ సర్పంచ్ మామిడి కేదార్ ఆదివారం తెలిపారు. ఈ రహదారిపై రోజూ వేలాదిమంది ప్రజలు, రైతులు ప్రయాణం చేస్తున్నారు.
కానుగ చెట్ల కొమ్మలు, కంప చెట్లు రహదారిని అడ్డుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి, కానుగ చెట్ల కొమ్మలను కొట్టించి, కంప చెట్లను తొలగించాలని కోరారు. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన రహదారిని అందించాలని మాజీ సర్పంచ్ అధికారులను కోరారు.