|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 03:10 PM
రైతుపై ఎలుగుబంటి దాడికి పాల్పడిన సంఘటన రామాయంపేట మండలం సదాశివనగర్ గిరిజన తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.విరాలల్లోకి వెళ్తే.. గిరిజన తండాకు చెందిన బాట్రోత్ హనుమంతు శనివారం రాత్రి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి రాత్రి పొలానికి నీళ్లుపెట్టి తెల్లవారుజామున పొలం నుండి ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యలోని అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి హనుమంతుపై దాడిచేసింది. వెంటను రైతువద్ద ఉన్న కర్రతో తిరిగి దాడి చేయడంతో ఎలుగుబంటి వెళ్లిపోయింది.గాయపడిన రైతు హనుమంతును వెంటనే కుటుంబ సభ్యులు రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. .