|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:39 PM
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గోదావరిఖనిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన దివంగత ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి, అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.