|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 05:27 PM
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్‌కు చెందిన అంబారీపేట లక్ష్మీనరసింహాచార్యులు శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నగరంలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో లక్ష్మీనరసింహాచార్యులు నేతృత్వంలోని ప్యానెల్ పూర్తి మెజారిటీతో విజయం సాధించింది.
ఈ విజయంతో ఎదులాబాద్ గ్రామంలో ఆనందోత్సవాలు జరిగాయి. గ్రామస్తులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు లక్ష్మీనరసింహాచార్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.