|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 05:23 PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చోటు చేసుకున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కవితను "లేడీ డాన్" అంటూ మధుయాష్కీ మండిపడ్డారు. ఆమె చేయని దందా, స్కాం లేదంటూ విరుచుకుపడ్డారు. జీఎస్టీ మోసాలు, దొంగ నోట్ల స్కాంలలో కవిత పాత్ర ఉందని ఆరోపించారు. కవితపై రూ. 800 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
లిక్కర్ స్కాం విషయానికొస్తే, ఇందులో కవితతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భాగస్వామిగా ఉన్నారని మధుయాష్కీ ఆరోపించారు. ఈ స్కాంకు సంబంధించిన కీలక చర్చలు ప్రగతి భవన్‌లో జరిగాయని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై బీఆర్‌ఎస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే రాజకీయంగా ఈ వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపే అవకాశముంది.