|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:40 PM
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కవిత వివాదంతో బీఆర్ఎస్ లో కలకలం కొనసాగుతోంది. అటు కాళేశ్వరం కమిషన్ విచారణకు రావాలంటూ కేసీఆర్, హరీష్ తో పాటుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. కవిత తన దూకుడు కొనసాగిస్తూనే కేసీఆర్ కు కాళేశ్వరం నోటీసులకు నిరసనగా ధర్నాకు నిర్ణయించారు. ఇదే సమయంలో కవిత వ్యాఖ్యల పై ఎవరూ స్పందించవద్దని కేసీఆర్ ఆదేశించారు. ఈ వరుస వివాదాల వేళ కేసీఆర్ ఆసక్తి కర నిర్ణయం తీసుకున్నారు.కవిత వివాదం మరింత ముదరకుండా కేసీఆర్ కీలక మంత్రాంగం నడిపారు. ఎవరూ కవిత వ్యాఖ్యల పైన స్పందించ వద్దని నిర్దేశించారు. కవిత తన అన్న కేటీఆర్ ను టార్గెట్ చేయటంతో ఆయన వ్యూహాత్మకంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. కవిత కొత్త పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు. తన తండ్రిని.. ప్రస్తుత పార్టీని కాపాడుకోవటం తన లక్ష్యమని స్పష్టం చేసారు. అయితే, పార్టీ పైన వ్యాఖ్యలు చేయటంతో ఇప్పటి వరకు కవితకు కలిసేందుకు కేసీఆర్ అవకాశం ఇవ్వ లేదు. అదే సమయంలో నేరుగా ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. హరీష్ ఈ రోజు పార్టీ నేతల సమావేశంలో కవిత వ్యాఖ్యలను కౌంటర్ చేసారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని.. కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పారు. నోటీసుల జారీతో ఇక, మరో వైపు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను టార్గెట్ చేయటానికి కాళేశ్వరం లో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. అటు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కాగా, కేసీఆర్ హాజరు కావాల్సిన తేదీ మారిం ది. తాజాగా కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని ఈనెల 11కు మార్చారు. ఈ మేరకు కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. జూన్ 6న ఎమ్మెల్యే హరీశ్‌రావు, జూన్ 9న ఎంపీ ఈటల రాజేందర్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ ముగ్గురు కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రాజెక్టు, ఆనకట్టల నిర్మాణంపై అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం కమిషన్ విచారించనుంది. కవిత కు తేల్చి చెప్పిన హరీష్ - కేసీఆర్ ది ఇదే ఫైనల్ డెసిషన్..!! విచారణకు కేసీఆర్సీ ఎంగా, కొంతకాలం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కేసీఆర్, కొంతకాలం ఇరిగేషన్, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, కొంతకాలం ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పని చేశారు. ఎంపీ ఈటల రాజేందర్ అనంతరం పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరిన కూడా కమిషన్ విచారణకు పిలిచింది. సహజ న్యాయసూత్రం ప్రకారం ముగ్గురి వాదనలను వినాలని కమిషన్ నిర్ణయించింది. ముగ్గురి వాగ్మూలాలను పీసీ ఘోష్ కమిషన్ రికార్డ్ చేసుకోనుంది. అయితే, కేసీఆర్ విచారణకు హాజరు అవు తారా లేదా అనే డైలమా వేళ కేసీఆర్ 11న విచారణకు హాజరు కావాలని నిర్ణయించారు. దీని ద్వారా కాళేశ్వరం పైన జరుగుతున్న ప్రచారానికి ముగింపు ఇవ్వాలని భావిస్తున్నారు. కేసీఆర్ విచారణ వేళ చోటు చేసుకునే పరిణామాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.