|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:34 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సోమవారం తెలంగాణ దేవాదాయ శాఖ కమీషనర్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కుచెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి కళ్యాణమండపములో ఆలయ అర్చకులు కమిషనర్ వెంకట్రావు దంపతులకు వేదోక్త ఆశీర్వాదం అందించగా, అనంతరం ఈవో కే. వినోద్ శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు.