|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 04:33 PM
విద్యార్థులు విద్యతో పాటు తమకు నచ్చిన క్రీడను ఎంచుకొని రాణించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట స్టేడియంలో ఎండిసిఎ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 19 క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కాసేపు సరదాగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శరీరం దృఢంగా మారుతుందన్నారు.