|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 07:49 PM
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఆఫీస్‌లో నిర్వహించిన అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హైడ్రా ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఓఆర్‌ఆర్ (ORR) వరకు పరిమితిని నిర్ణయించి రూపొందించిందని కమిషనర్ తెలిపారు. హైడ్రా ప్రధాన బాధ్యతలలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ మరియు ప్రజా ఆస్తుల పరిరక్షణ ముఖ్యమని, ఇవే కాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధికి శాశ్వత భద్రత, సమగ్రమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలంటే ప్రతి ఉద్యోగి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలి” అని పిలుపునిచ్చారు.