|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 06:54 PM
వికారాబాద్ జిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం బయటపడింది. కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ పట్టణంలో నవాజ్ అనే వ్యక్తి ‘బ్రెయిన్ ట్రీ’ పేరుతో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్‌లో శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థిని పట్ల నవాజ్ అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు మంగళవారం సెంటర్‌కు చేరుకుని నవాజ్‌పై దాడి చేశారు. అనంతరం ఆయన్ను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.