|
|
by Suryaa Desk | Wed, Nov 05, 2025, 08:06 PM
రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇళ్లు, ప్లాట్లు అమ్ముడవకపోవడంతో యజమానులు లక్కీ డ్రా విధానాన్ని అవలంబిస్తున్నారు. రూ.500 నుంచి రూ.1000 వరకు కూపన్లు విక్రయించి, గెలిచిన వారికి ఆస్తులు ఇస్తున్నారు. ఈ పద్ధతి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాచుర్యం పొందుతోంది. యాదాద్రి చౌటుప్పల్‌లో రూ.500 కూపన్‌తో కొందరు లక్షల రూపాయల ఇళ్లు గెలుచుకున్నారు. లక్కీ డ్రా చట్టబద్ధం కాకపోయినా, తక్కువ పెట్టుబడితో ఇల్లు దక్కుతుందనే ఆశతో ప్రజలు ఆకర్షితులవుతున్నారు.