|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 10:20 AM
TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద 44వ జాతీయ రహదారి ఫ్లైఓవర్‌పై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. ముందువెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ట్యాంకర్ నుంచి పొగలు వచ్చాయి. వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్తూరు నుండి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో 26 మంది ఉన్నారు. అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం.