|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 10:58 AM
TG: హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఓ వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన ఓ మహిళ చంద్రశేఖర్ అనే వ్యక్తి సహాయంతో కాప్రా శ్రీరామ్ నగర్ లో మూడు నెలలుగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహిళలకు డబ్బు ఆశ చూపించి వ్యభిచారంలోకి దింపుతున్నారని పోలీసులు తెలిపారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.