|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 11:01 AM
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి. విద్యార్థి దశ నుంచే మెదడుకు పదును పెట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, విజ్ఞానాన్ని అందిపుచ్చుకొన్నవారే ఉన్నత స్థాయికి ఎదుగుతారని వారు అన్నారు. విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదిగి అనేక ఆవిష్కరణలు చేయాలని, అబ్దుల్ కలాం వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.