|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 11:25 AM
TG: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈనెల 23న తుది ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలు విడుదల చేయనుంది. డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముండగా, నెలాఖరులోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. డిసెంబరు 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుండటంతో.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.