|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:49 PM
రామాయంపేటలో జరిగిన సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అధికార కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటిని సమర్థంగా వివరించి అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, అభివృద్ధి-సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఐకమత్యంతో కృషి చేస్తే మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.