|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:53 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సోమవారం చర్చి గాగిల్లాపూర్‌లో జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించినట్లు వెల్లడించారు.వృద్దురాలు సుశీలకు కళ్ళు తాగే అలవాటు ఉండగా.. ఆమెతో రోజు కలిసి కళ్ళు సేవించే మహిళనే హంతకురాలుగా పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అనుమానితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. సుశీల ఒంటిపై ఉన్న బంగారు కమ్మల కోసమే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు స్థానికంగా ఉండే ఒక మహిళ ఈ దారుణానికి ఒడి కట్టినట్లు దుండిగల్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చర్చి గాగిల్లాపూర్‌కు చెందిన 85 ఏళ్ల సుశీలమ్మ హత్య కేసులో, ఆమె ఇంట్లో పనిచేసే పని మనిషి కవిత (36)ను పోలీసులు అరెస్టు చేశారు. బంగారం కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.