|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:45 PM
టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ తన సినీ ప్రయాణం, సవాళ్లు, అపోహలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'ఓం శాంతి శాంతి శాంతిః' సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో, తన కెరీర్ అంత సులభంగా సాగలేదని, నటుడిగా మంచి పేరు వచ్చినా, వ్యక్తిగత సంతృప్తి దర్శకత్వంలోనే ఉందని తెలిపారు. 'ఈ నగరానికి ఏమైంది' సినిమా స్కేల్ పెద్దగా ఉంటుందని, విభిన్న జానర్లలో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమలో 'అవుట్‌సైడర్స్' అనే చర్చపై మాట్లాడుతూ అది మనం సృష్టించుకున్న అపోహ అని, టాలెంట్ ఉంటే ఎవరికైనా అవకాశాలు దక్కుతాయని అభిప్రాయపడ్డారు.రివాల్వర్, డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్న క్యారికేచర్, నటరాజ కాంపస్ బాక్స్ ఇవన్నీ ఆసక్తికరంగా వున్నాయి. ఈ అంశాలు పొలిటికల్ సెటైర్, క్రైమ్, హాస్యం కలగలిసిన ఎంటర్టైనర్ ని సూచిస్తున్నాయి. “నవ్వకండి! ఇది చాలా సీరియస్ మేటర్!”అనే ట్యాగ్‌లైన్ మరింత హిలేరియస్ గా వుంది. టీజర్ ఫిబ్రవరి 9న విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిస్తుండగా, విష్ణు ఓయి, హర్షవర్ధన్ ,శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.విద్యా సాగర్ చింత సినిమాటోగ్రఫీని, స్వీకర్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు, విప్లవ్ నైషధం ఎడిటర్ ప్రొడక్షన్ డిజైన్ చంద్రిక గొర్రెపాటి, కథను సూర్య ప్రకాష్ జ్యోసుల అందించారు.ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.
Latest News