|
|
by Suryaa Desk | Tue, Feb 20, 2024, 01:41 PM
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరైన సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ అనుభవాలను అందరితో పంచుకోవడంతోపాటు, ఆ వ్యాధి సంబంధిత విషయాలపై అవగాహన కల్పించేందుకు ‘టేక్ 20’ పేరుతో హెల్త్ పాడ్‌కాస్ట్ ప్రారంభించారు. దానికి సంబందానికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేశారు. సమంత అడిగిన పలు ప్రశ్నలకు న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ జవాబులిచ్చారు. ఎంతో రీసెర్చ్ చేసి, అనుభవజ్ఞులైనవారి సలహా, సూచనలతో ఈ వెల్‌నెస్ కంటెంట్‌ను అందిస్తున్నట్లు సమంత చెప్పుకొచ్చారు.
Latest News