|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:18 PM
యోగా చేయడం వల్ల ఆయురారోగ్యాలు సమకూరుతాయని ప్రతి ఒక్కరు ప్రతి దినం ఒక అరగంట పాటు యోగా చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వనపర్తి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే యోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.