|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:20 PM
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం పరిధిలోని గోదల్ ప్రభుత్వ పాఠశాలలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు యోగ గురించి వివరించి, ప్రతిరోజు యోగా చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను పాఠశాల విద్యార్థులకు తెలిపారు. యోగ వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరామ్ సింగ్, ఉపాధ్యాయుడు మందా రమేష్ పాల్గొన్నారు.