|
|
by Suryaa Desk | Fri, Jun 21, 2024, 03:21 PM
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని కృష్ణానదిలో ఆంజనేయులు అనే గొర్రెల కాపరి పై శుక్రవారం మొసలి దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. నది ఒడ్డున గొర్రెలు మితమేస్తున్న క్రమంలో మొసలి ఓ గొర్రెపే దాడి చేసి తీసుకెళ్తుండగా కాపాడే క్రమంలో కాపరి కుడి కాలుపై దాడి చేసి నదిలోకి ఈడ్చి వెళ్తుండగా ప్రాణాల రక్షించుకున్నట్లు తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.