by Suryaa Desk | Thu, Sep 05, 2024, 04:23 PM
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొంతమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కాసేపటి క్రితం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా, బీఆర్ఎస్ ఐటీ వింగ్ లో కీలక బాధ్యతలు పోషించిన దిలీప్ కొంతమ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రభుత్వంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ లోగోను మారుస్తుందని సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేసు నమోదవగా.. పూర్తి వివరాలు సమర్పించే దాకా అరెస్ట్ చేయరాదని హైకోర్ట్ నుండి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేశారని నేడు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.