![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 05:03 PM
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సంచలన కామెంట్లు చేశారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్‌పై ఓ సిటిజన్ ఫిర్యాదు చేశారని, ఆ కేసు మేరకు మెుత్తం 11 మంది ఇన్స్‌ఫ్యూఎన్సర్లపై క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. నిందితుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నామన్నారు. ఏఏ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎలాంటి వీడియోలు పెట్టారనే అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎవరూ ప్రమోట్ చేయవద్దని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.