![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 04:08 PM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య ఉచిత పాస్‌ల విషయంలో నెలకొన్న వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతున్న సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్,హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.టికెట్ల విషయంలో వివాదం చోటు చేసుకుంది. లెక్కకు మించి టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుందని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరోపించింది. దీనిపై జట్టు యాజమాన్యం బహిరంగంగానే లేఖ రాయడం జరిగింది.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతామని సన్‌రైజర్స్ హెచ్చరించింది. అయితే సన్‌రైజర్స్ చేసిన ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖండిచింది. వివాదం పెద్దది కావడంతో తెలంగాణ ప్రభుత్వం దీనిలోకి ఎంటర్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాన్ని హెచ్‌సీఏ బెదిరిస్తోందని వస్తోన్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె శ్రీనివాస్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
క్రికెట్ మ్యాచ్‌లకు పాస్‌లు డిమాండ్ చేస్తూ SRH యాజమాన్యానికి ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నేపథ్యంలో దరాబాద్ క్రికెట్ అసోసియేషన్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది.ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తామని సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలిపింది.గతంలో లాగే అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరింది. దీనికి సైతం సన్‌రైజర్స్ హైదరాబాద్ అంగీకరించింది.దీనిలో భాగంగానే హెచ్‌సీఏ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు సమావేశమయ్యారు.ఒప్పందం ప్రకారం 10 శాతం టికెట్లు ఇవ్వడానికి SRH అంగీకరించింది.హెచ్‌సీఏకు టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని SRH సీఈవో షణ్ముగం తెలిపారు.ఇరువర్గాల మధ్య చర్చల అనంతరం ఈ వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికారు.ఈ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరుపుతోంది.ఎస్‌ఆర్‌హెచ్, హెచ్‌సీఏ, బీసీసీఐ మధ్య ఉన్న ఒప్పందాల అమలుపై విజిలెన్స్ దర్యాప్తు నివేదిక అనంతరం ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కానుంది. ప్రస్తుతం ఈ వివాదం ముగిసిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోనే కొనసాగనుంది.