![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:43 PM
మక్తల్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో బుధవారం ప్రయాణికులకు సైబర్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించినట్లు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఎటిఎం, ఓటిపి వివరాలు ఇవ్వకూడదని సూచించారు.
ఫోన్లకు వచ్చే అనవసరపు మెసేజ్ లను తెరవకూడదని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు.