![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 07:49 PM
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రాయితీ గడువును ప్రభుత్వం ఈనెల 30 వరకు పొడిగించినట్లు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ రాయితీ కొరకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారుల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.