![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 12:27 PM
కేజీఎఫ్ భూములు నిజంగా ప్రభుత్వానికి చెందినవే అయితే దొడ్డిదారిన ఎందుకు వెళుతున్నారంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. అర్ధరాత్రులు చెట్లను నరికివేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు తెలిసీతెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందని, కోర్టులు చెప్పినా ప్రభుత్వం వినిపించుకోవడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చెట్లను పెంచి రాష్ట్రంలో హరిత విప్లవానికి తెరలేపామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు.