![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 04:15 PM
అమెరికా టారిఫ్ ప్రకటనల ప్రభావం వల్ల భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 322.08 పాయింట్లు నష్టపోయి 76,295.36 వద్ద, నిఫ్టీ 82.25 పాయింట్లు క్షీణించి 23,250.10 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా లాభపడగా, TCS, HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.44గా ఉంది.