![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 04:18 PM
గత కొన్ని రోజులుగా వేసవి ఎండల వేడితో ప్రజలు సతమతమవుతున్న వేళ.. మారిన వాతావరణం కాస్త ఉపశమనం కలిగించింది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం దంచి కొట్టింది. గురువారం మధ్యాహ్నం వరకు బగా బగా మండిన సూర్యుడు ఒక్కసారిగా చల్లబడి మబ్బులు కమ్మేశాయి.దీంతో నాంపల్లి,కార్వాన్, గోషామహల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురువగా,మరికొన్ని చోట్ల వర్షం దంచి కొట్టింది.కాగా ఎండల తీవ్రతతో ఇబ్బంది పడ్డ జనాలకు ఈ వర్షంతో కొంత మేరకు ఉపశమనం లభించింది.