![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:02 PM
నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం కోల్పోయిన వృద్ధ మహిళ కనబడింది. స్థానికుల సమాచారంతో స్పందించిన పోలీసులు ఆమెను తమ సంరక్షణలోకి తీసుకున్నారు.
గురువారం నల్గొండ టూ టౌన్ ఎస్ఐ సైదులు విచారణలో సామాజిక మాధ్యమం ద్వారా కుటుంబ సభ్యులను గుర్తించారు. అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే పోలీసులకు సమాచారం వెంటనే అందించగలరని పిలుపునిచ్చారు.