![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:04 PM
HYDలోని కంచె గచ్చిబౌలి భూముల్లో ఈనెల 7 వరకు చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికి చెట్ల కొట్టివేత కొనసాగుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఆధారాలు చూపించారు.
ఆధారాలు కోర్టుకు సమర్పిస్తున్న హెచ్‌సీయూ విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారని చెప్పారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.