![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:56 PM
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇటీవల రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో తల్లి రజిత తన ప్రియుడి శివతో కలిసి జీవించడానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని.. అన్నంలో విషం పెట్టి చంపినట్లు తెలిసింది. దీంతో పోలీసులు రజిత, ఆమె ప్రియుడు శివను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.