![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 05:59 PM
HCU భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని BRS నేత హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు ఇది చెంపపెట్టు లాంటిదన్నారు.
'నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు హెచ్‌సీయూ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే, చట్టం చూస్తూ ఊరుకోదు. ఇది విద్యార్థుల విజయం, పర్యావరణ ప్రేమికుల విజయం, సామాజికవేత్తల విజయం' అని పేర్కొన్నారు.