![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:12 PM
దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో గురువారం దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బానిస బంధాల నుంచి, వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.