![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 06:53 PM
తాండూరు మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు రాజీవ్ కాలనీ, 17వ వార్డు పాత తాండూరులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో పేదలకు అన్నం పెట్టాలన్న సంకల్పంతో సీఎం సన్నబియ్యం పంపిణీ పథకం చేపట్టారని తెలిపారు.