![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 02:40 PM
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతో పాటు పలు కీలక అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో రోజుకు రెండు ఉమ్మడి జిల్లాల నేతలతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, వాణిదేవి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, పద్మారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్, ముఠా జైసింహా, మాజీ చైర్మన్ క్రిశాంక్ మన్నెతో పాటు తదితరులు పాల్గొన్నారు.