![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 03:36 PM
మర్రిగూడ మండలంలోని ఇందుర్తి - మేటి చందాపురం గ్రామంలో ఈనెల 6న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆదివారం రోజున స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని, కావున భక్తులు ఇట్టి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.