![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 05:52 AM
వరంగల్ జిల్లా, రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు కొంతమంది ఖాతాదారులు తాళం వేశారు. చోరీకి గురైన బంగారం విషయంలో ఖాతాదారులు ఈ చర్యకు దిగారు. గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఈ బ్యాంకులో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 497 మంది ఖాతాదారులకు చెందిన 16 కిలోలకు పైగా బంగారం చోరీకి గురైంది.తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని ఖాతాదారులు ఆ రోజు నుండి బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులు వాయిదా వేస్తూ వస్తుండటంతో బాధిత ఖాతాదారులు పలుమార్లు ఆందోళన నిర్వహించారు. ఏప్రిల్ 4వ తేదీన చెల్లింపులు జరుపుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.ఈరోజు బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు అధికారులు సోమవారం నాడు చెల్లింపులు చేస్తామని చెప్పడంతో ఆగ్రహించిన ఖాతాదారులు బ్యాంకుకు తాళం వేసి నిరసన చేపట్టారు. బ్యాంకు అధికారులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు నిరసన కొనసాగించారు. తమ బంగారం తిరిగి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు.