![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 03:09 PM
బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ కు గచ్చిబౌలి పోలీసుల నోటీసులు. HCU అంశంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేశారని నోటీసులు.ఈ సందర్బంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ డ్యామేజ్ కంట్రోల్ చేయడం ప్రారంభించింది AI ను ఎక్కడ వాడలేదు. ఇటీవల HCUలొ విడుదల చేసిన ఫోటోలు విడియోలు అన్ని వాస్తవమే. మేము లీగల్ గా ఎదుర్కోటాం . జింకలు ఎందుకు రోడ్డు మీదకు వచ్చాయి, ఇళ్లలోకి కూడా వెళ్ళాయి అవన్నీ విడియోలు ఉన్నాయి . అక్కడ జింకలు లేవు, అక్కడ నక్కలు ఉన్నాయని అన్నారు . ఆంక్షలు పెట్టారు,ఇక్కడ ఎవరు రావొద్దు అని ప్రకటన చేశారు. Ai తో వీడియో లు సృష్టించారు అని అబద్ధాలు చెప్తుంది. Ai గురించి మాట్లాడే అర్హత ఉందా కాంగ్రెస్ కు. జాతీయ స్థాయిలో ఆ వీడియో లు జింకలు, నెమళ్లున్నాయని తేలింది. 4 కేసులు నాపై పెట్టింది ప్రభుత్వం. జింకలు చనిపోవడానికి కారణం ఎవరు, ఆ చెట్లను నరకడానికి కారణం ఎవరు?. వీటికి కారణం అయిన ఎవరిపైనా కేసులు పెట్టాలి. అందరూ విడియోలు పెడుతున్నారు. 20 వేలు ఇస్తు రీల్స్ చెపిస్తున్నారు - మన్నే క్రిశాంక్ బీఆర్ఎస్ నేత