![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 03:03 PM
అడవితల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలోని దుంబ్రిగూడలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. "ఆదివాసీ గ్రామాలకు సరైన రహదారులు లేవు. మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయాలని సీఎం ఇంటికి వెళ్లి కోరాను. నేను కోరిన వెంటనే రూ.49 కోట్లు మంజూరు చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.400 కోట్లు మంజూరు చేస్తున్నాం. అడవిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది." అని అన్నారు.అలాగే అంగన్వాడి కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేసారు పవన్ కళ్యాణ్. గ్రామంలోని చిన్నారులకు తనతో తెచ్చిన స్వీట్ బాక్సు లను అందించారు పవన్ కళ్యాణ్. అలాగే గ్రామస్తుల ముఖాముఖిలో గ్రామస్తులు అడిగిన 12 సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.