![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:48 PM
మోదీ సర్కార్ ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన సోమవారం పేర్కొన్నారు. డీలిమిటేషన్ జరగకుండా ఉండేందుకు కోదండరాంతో కలసి నడుస్తామని ఆయన తెలిపారు. 11 ఏళ్లలో మోదీ సర్కారు తెలంగాణకు ఇచ్చింది సున్న అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధానిని ఒప్పించే దమ్ముందా? అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బీజేపీ నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారని విమర్శించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసిన పనులు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర బండి సంజయ్‌ది అని... ఆయన మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ అని... ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.