![]() |
![]() |
by Suryaa Desk | Mon, Apr 07, 2025, 02:45 PM
భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టాభిషేక మహోత్సవ క్రతువు ఘనంగా ముగిసింది. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణమండపంలో స్వామివారికి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం మహాపట్టాభిషేకం చేయటం భద్రాచలం దేవాలయ ప్రత్యేకం.శ్రీరామనవమి ఉత్సవాలు ఆదివారం తెల్లవారుజాము నుంచే భద్రాద్రిలో మొదలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటలకు పురోహితులు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, మంగళాశాసనం, అభిషేకం చేపట్టారు. కార్యక్రమానికి సీఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తదితరులు హాజరయ్యారు. అనంతరం కల్యాణమూర్తులను పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల నడుమ మిథిలాస్టేడియం ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు.