![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 01:57 PM
పేద ప్రజల ఆరోగ్యం, ఆత్మగౌరవం పెంచే పథకమే సన్నబియ్యం పంపిణీ పథకమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించి రూ. 5 లక్షలు వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.